Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థ్యాంక్యూ వెరీ మచ్ సార్... ప్రధాని మోదీకి లేఖ రాసిన పళనిస్వామి!

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎడప్పాడి పళని స్వామిని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు పళని స్వామి తొలి లేఖ రాశారు. ‘సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన నాకు, మీ అభినందనలు అందడం ఆనందంగా ఉంది. మీ సహకారం, మద్దతుతో తమిళనాడును మరింత అభివృద్ధి చేస్తా. దివంగత సీఎం జయలలిత ఆశయాలను నెరవేరుస్తా’నని ఆ లేఖలో పళనిస్వామి పేర్కొన్నారు.

More Telugu News